2011లో ఒక చిన్న కంపెనీ – ఇప్పుడు మిలియన్ల విద్యార్థులు
BYJU’S business failure-హాయ్ అందరికీ!
2011లో ఒక చిన్న కంపెనీ మొదలైంది.
ఆ కంపెనీ 25 మంది విద్యార్థులతో మొదలై,
కేవలం 10 ఏళ్లలోనే – 2021 నాటికి – భారతదేశంలోనే Most Valuable స్టార్టప్‌లలో ఒకటిగా మారింది.
ఇప్పుడు మిలియన్లు కాదు… హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్ల విద్యార్థులు వాళ్ల Content ఉపయోగిస్తున్నారు.
దేశంలో టాప్ స్టార్ కూడా వాళ్లను Support చేస్తున్నారు.
చాలా తక్కువ టైంలోనే ఇది ఇండియాలో Top Edtech Companyగా మారింది.

BYJU’S అనే పేరుతో ఘనమైన ప్రయాణం
ఆ కంపెనీ మనందరికీ తెలుసు – BYJU’S.
కరోనా వల్ల Education పూర్తిగా Change అయింది.
అన్ని దేశాల్లో స్కూళ్లు మూసిపోవడంతో చాలామంది Families Adjust కావడం కష్టం అనిపిస్తోంది.
ఇలాంటి టైంలో Online Education Platforms చాలా Important అయిపోయాయి.
గత కొన్ని ఏళ్లలో BYJU’S ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ల విద్యార్థులను Touch చేసింది.
BYJU’S business failure లో తొలిస్టెప్
ఈ రోజు మన కథనంలో మనం చూస్తున్నది – BYJU’S.
ఇది ఒక Timeలో చాలా Famous అయిన Unicorn Company.
ఇప్పుడు మాత్రం Serious Problems ఎదుర్కొంటోంది.
ఒక నెల క్రితమే, BYJU’S బోర్డ్‌లో ఉన్న ఒక పెద్ద investor రాజీనామా చేశాడు. BYJU’S ఇప్పుడు Foreign Exchange rules ని వాయిలేట్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి..
గత రెండు సంవత్సరాల్లో BYJU’S చాలా Downfall చూసింది.
ప్రెస్ వాళ్లు వాళ్లని తీవ్రంగా Criticize చేస్తున్నారు.
ఇన్వెస్టర్లు ట్రబుల్ చేస్తున్నారు, ఆడిటర్ మరియు బోర్డు మెంబర్లు రాజీనామా చేశారు.
వేల మంది Employeesని Job నుంచి తీసేశారు.
అందులో ఎక్కువగా నష్టం – వేల కోట్ల రూపాయల Loss.
BYJU’S 327 మిలియన్ డాలర్ల నష్టం చూపించింది.
ఇది ఇండియన్ కరెన్సీలో 4,564 కోట్లు.
ఆరంభగమనాన్నిచూద్దాం
2022లో వాళ్ల కంపెనీ విలువ $22 బిలియన్ ఉండగా, ఇప్పుడు $3 బిలియన్ కంటే తక్కువగా పడిపోయింది.
కారణం ఏంటంటే – BYJU’S కొన్ని Bold Steps తీసుకుంది… కానీ అవి Work Out కాలేదు.
కాబట్టి మీరు ఒక Business Owner గానీ, Entrepreneur గానీ ఐతే –
ఈ కథనాన్ని చాలా జాగ్రత్తగా వినండి.
ఇది మీకు Failure Situation నుంచి బయటపడటానికి Help చేస్తుంది.
BYJU’S business failure – పూర్తివిశ్లేషణ
ప్రారంభకథనం
ఈ కథ 2011లో మొదలైంది.
ఒక మంచి Teacher అయిన రవీంద్రన్ గారు, ఆయన భార్య దివ్యతో కలిసి BYJU’S ని స్టార్ట్ చేశారు.
వాళ్లకో Vision ఉంది – స్కూల్ విద్యార్థుల కోసం learning Content తయారు చేయాలి.
ఇంకొంతవరకూ Competitive Examsకి కూడా తయారీ చేయాలనుకున్నారు.
2015లో వాళ్లు BYJU’S learning App launch చేశారు.
2016లో ఆ app 5.5 మిలియన్ సార్లు డౌన్లోడ్ అయిందని Company చెబుతోంది.
అందులో 2.5 లక్షల మంది Yearly Paid Subscribers ఉన్నారు.
అక్కడినుంచి వాళ్ల User Base రోజు రోజుకీ పెరిగింది:
- 2019 నాటికి 4 కోట్లు (40 Million) Users
- 2021 నాటికి 8 కోట్లు (80 Million) Users
- ఇప్పుడు సుమారు 150 Million users ఉన్నారు!
ఆదాయవిశ్లేషణ
వాళ్ల Revenue కూడా బాగా పెరిగింది:
- 2016లో ₹110 కోట్లు
- 2018లో ₹500 కోట్లు
- 2021లో ₹2,428 కోట్లు
- 2022లో ఆడిట్ ప్రకారం ₹3,569 కోట్లు
ఈ డబ్బు మూడు Sources నుంచి వచ్చిందట:
- Tablet & SD Card అమ్మకాలు
- Reference Books
- Tuitions మరియు Service Fees
విలువ పెరిగినా సమస్యలు మొదలయ్యాయి
2022లో అది $22 బిలియన్ దాటింది!
ఇది ఒక Benchmark అయింది – మిగతా Edtech Companiesకి Targetలా మారింది.
కానీ ఇదే సమయంలో వాళ్ల losses కూడా వేగంగా పెరిగాయి:
- 2016లో నష్టం ₹49 కోట్లు
- 2020లో ₹249 కోట్లు
- 2021లో ₹4,588 కోట్లు
- FY22లో losses ₹2,253 కోట్లు
BYJU’S business failure– కారణం 1: Marketing Budget
వాళ్లలో అత్యధిక ఖర్చు Advertising & Promotions మీదే ఉంది.
2021లో మొత్తం ఖర్చులో 32% Business Promotionకి ఖర్చు పెట్టారు!
IPL టైటిల్ స్పాన్సర్ నుంచి FIFA వరల్డ్‌కప్ దాకా,
షారుక్ ఖాన్, మెస్సీ లాంటి స్టార్స్‌ని Brand Ambassadors చేసుకోవడం – అన్నీ Brand Promotion కోసమే.
2021లో Marketing ఖర్చు ₹2,509 కోట్లు – అయితే Revenue ₹2,428 కోట్లుమాత్రమే!
కారణం 2: Sales Strategy & Trust Loss
Sales వాళ్లు చాలా Aggressiveగా Parentsని Target చేశారు.
“మీ పిల్లలు Fail అవుతారు…” అని భయపెట్టడం,
Temples, Malls వరకూ వెళ్లి Pitch చేయడం జరిగింది.
Repeated calls, undue pressure వల్ల Parentsకి Irritation వచ్చేసింది.
False Promises చెప్పడం, Multi-Year Packagesకి ఒత్తిడి – ఇవన్నీ Trust తగ్గించాయి.
కారణం 3: Loan Strategy
LOAN Sales వల్ల మరింత మందిని భయపెట్టి Course కొని పెట్టించారు.
కొందరికి Loan Apply చేసినసంగతికూడాతెలియదు.
BYJU’S Follow చేసిన “First Loss and Default Guarantee” Method వల్ల
low-income వాళ్లకి Loan Approve అయ్యాయి – కానీ Companyకు Risk పెరిగింది.
కారణం 4: Accounting Problems
Accrual Principleకి విరుద్ధంగా Revenue Recognize చేశారు.
Multiple-Year Courses మొత్తాన్ని ఒకే Year లో చూపించడం జరిగింది.
ఇది Investorsకి Inflated Growth చూపించడమే అయ్యింది.
Country-wise Performance
Indiaలో Trust Issues వల్ల Sales తగ్గినపుడు
USAలో 133% Growth
Middle Eastలో 103% Growth వచ్చింది.
BYJU’S business failure – కారణం 5: Aggressive Acquisitions
WhiteHat Junior (300 మిలియన్లు),
Akash (950 మిలియన్లు),
మొత్తం 17 కంపెనీలు కొనుగోలు చేశారు.
కానీ అవి లాభాల్లో లేకపోవడం వల్ల నష్టాలు పెరిగాయి.
Consumers పెరిగినా Operating Cost బాగా పెరిగింది.
కారణం 6: Risky Loans – Term Loan B
BYJU’S 1.2 బిలియన్ డాలర్ల Term Loan B తీసుకుంది.
ఈ రుణానికి చెల్లింపుల షరతులు చాలా కఠినంగా ఉన్నాయి.
Credit Ratings, Timely Financials వంటి షరతులు ఉన్నా BYJU’S వాటిని పాటించలేదు.
దీంతో వారు డిఫాల్ట్ అయ్యారు, కేసులు పెట్టారు.
ఫైనల్విశ్లేషణ – పాఠాలు
- Financial Planning లేకుండా Rapid Growth వల్ల వచ్చే ప్రమాదాలు
- Trust లేకుండా Long-Term Success సాధ్యం కాదు
- Aggressive Sales & Loans – Brandకి నష్టం
- Accounting లో సరైన ప్రమాణాలు పాటించకపోతే Regulatory Issues వస్తాయి
- Acquisitions చేసే ముందు ఆ కంపెనీ లాభదాయకత చూడాలి
- Risky Loans Businessని కుదించొచ్చు
BYJU’S business failure – చివరిమాట
వారెన్‌బఫెట్ చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి:
“పేరు కట్టుకోవడానికి 20 సంవత్సరాలు పడతాయి… కానీ 5 నిమిషాల్లో అది నాశనం అవుతుంది.”
ఇదే BYJU’S downfall case study.
మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.