మీ గురించి మీరు (Tell Me Somethig about Yourself) చెప్పడమనే విషయం ప్రతి ఇంటర్వ్యూలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఇది మీ వ్యక్తిత్వాన్ని, ప్రాధాన్యతలను, లక్ష్యాలను ఇతరులకు తెలియజేయడానికి మీకు సహాయపడుతుంది. కాబట్టి, ఈ విషయం గురించి ఎలా మాట్లాడాలో ప్రాథమికంగా తెలుగులో వివరించాను.
మీ గురించి చెప్పేటప్పుడు కొన్ని ముఖ్యాంశాలు:-
- మీ పేరు మరియు పుట్టిన స్థలం
మీ పేరు మరియు మీరు ఎక్కడ నుండి వచ్చారు అనేది చెప్పడం మొదలుపెట్టండి.
ఉదాహరణ:
“నా పేరు రామకృష్ణ, నేను హైదరాబాద్ Ameerpet నుంచి వచ్చాను.” - మీ విద్య
మీ విద్యార్హతలను క్లుప్తంగా వివరించండి.
ఉదాహరణ:
“నేను బి.టెక్ కంప్యూటర్ సైన్స్‌లో పూర్తి చేశాను. నాకు B.Tech లో First ర్యాంక్ వచ్చింది.” - మీ కుటుంబం గురించి
మీ కుటుంబం గురించి కొన్ని వివరాలను చెప్పండి, కానీ చాలా డీటైల్స్ అవసరం లేదు.
ఉదాహరణ:
“నా కుటుంబంలో Four Members ఉన్నారు. నాన్న వ్యాపారవేత్త, అమ్మ గృహిణి, నాకు ఒక చెల్లెలు ఉంది.” - మీ నైపుణ్యాలు
మీరు ఏవేవి నేర్చుకున్నారు, మీకు ఏదైనా ప్రత్యేక నైపుణ్యం ఉందా అన్న విషయాలు చెప్పండి.
ఉదాహరణ:
“నాకు కోడింగ్‌లో మంచి అవగాహన ఉంది. Programming Languages Like జావా, పైథాన్ లో మంచి నైపుణ్యం కలిగి ఉన్నాను.” - మీ బలాలు
మీ బలాలు గురించి చెప్పడం మీ ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది.
ఉదాహరణ:
“నాకు సమయ పాలన చాలా బాగా ఉంటుంది. కొత్త విషయాలు త్వరగా నేర్చుకోవడంలో నేను మంచి అభిరుచి కలిగి ఉన్నాను.” - మీ బలహీనతలు
మీ బలహీనతలు చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా చెప్పండి.
ఉదాహరణ:
“నా బలహీనత ఏమిటంటే నేను కొన్ని సార్లు పని పట్ల ఎక్కువ దృష్టి పెట్టి ఇతర విషయాలను మర్చిపోతాను. కానీ ఇప్పుడు నేను దీన్ని సమర్థవంతంగా మెరుగుపరుచుకుంటున్నాను.”
మీ గురించి చెప్పడంలో ముఖ్యమైన చిట్కాలు
స్పష్టంగా మాట్లాడండి: మీరు చెప్పే విషయాలు స్పష్టంగా ఉండాలి.
అవసరమైన వివరాలకే పరిమితం చేయండి: మీ గురించి చెబుతున్నప్పుడు అనవసరమైన విషయాలు మానుకోండి.
సాధారణ శైలిలో చెప్పండి: భాష సులభంగా, అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి.
ఆత్మవిశ్వాసంతో ఉండండి: మీకు మీరు నమ్మకం ఉంచుకుని మాట్లాడండి.
విజయం ఉదాహరణలు చెప్పండి: మీ గత విజయాల గురించి కొన్ని ఉదాహరణలు చెబితే ఇంకా బాగుంటుంది.
- మీ అభిరుచులు మరియు హాబీలు
మీకు చేసే ఇష్టమైన పనులు లేదా హాబీలు గురించి చెప్పండి.
ఉదాహరణ:
“నాకు పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, మరియు నడకకు వెళ్లడం చాలా ఇష్టం.” - మీ భవిష్యత్తు లక్ష్యాలు
మీ కెరీర్ లక్ష్యాలను మరియు వ్యక్తిగత అభిరుచులను గురించి వివరించండి.
ఉదాహరణ:
“నా భవిష్యత్తు లక్ష్యం ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఎదగడం, అలాగే ఒక మంచి నాయకుడిగా ఉండడం.”
Example:-
“My name is Srilatha. I was born in Hyderabad, Telangana. About my educational qualifications, I have completed B.Tech (Information Technology).
During my education I developed a keen interest in programming. I have good skills in coding, design, and database management.
About My Family my father is a government employee, and my mother is a housewife. My family has always supported me in my career.
Talking about my strengths, I am strong in punctuality, team work, and problem solving. I have my weaknesses too, but I always strive to improve them. I think I still need to master public speaking.
My hobbies are reading books and learning new programming languages.
My future goal is to establish myself as a good software engineer and be part of a growing organization. My personal goal is to be a person full of humane values.”
మీ గురించి చెప్పడం అనేది ఒక శ్రద్ధగల ప్రక్రియ. మీరు మీ గురించి చెప్పే విధానం మీ వ్యక్తిత్వాన్ని, నైపుణ్యాలను, మరియు లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. కాబట్టి, సాధన చేయడం మరియు క్లుప్తంగా, స్పష్టంగా ఉండటం చాలా అవసరం.